పాకిస్థాన్‌ రాజకీయాల్లో మళ్లీ నవాజ్‌ షరీఫ్‌ కుటుంబ శకం ప్రారంభమైనట్టే కనిపిస్తోంది. మాజీ ప్రధాని నవాజ్‌ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే.. షెహబాజ్‌ షరీఫ్‌కు కూడా సుదీర్ఘ రాజకీయ చరిత్రే ఉంది. ఆయన పాకిస్తాన్‌ పంజాబ్‌కు మూడసార్లు సీఎం అయ్యారు. అయితే.. ఈయనపై కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అవేంటో తెలుసా..


ఆదాయానికి మించిన ఆస్తులు, నగదు అక్రమ చలామణి అభియోగాలతో రెండేళ్ల క్రితం షెహబాజ్‌ షరీఫ్‌ అరెస్టు కూడా అయ్యారు. అవినీతి కేసులో 2020 సెప్టెంబరులో అరెస్టయిన షెహబాజ్‌.. కొన్ని నెలలపాటు జైల్లో కూడా గడిపారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు. అలాగే బ్రిటన్‌లో షెహబాజ్‌ షరీఫ్‌ పై  1,400 కోట్ల రూపాయల నగదు అక్రమ చలామణి కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అయితే.. పాకిస్థాన్‌ రాజకీయాలను శాసించే సైన్యంతో మాత్రం షెహబాజ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: