ఏపీ సీఎంగా జగన్‌ ఎన్నిక అవడం అనేది వన్ టైమ్ వండర్ అంటున్నారు ఎంపీ సుజనా చౌదరి.. అలా వన్ టైమ్‌ వండర్‌ జరిగిపోయిందని.. జగన్ కూడా వన్ టైమ్ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని ఎంపీ సుజనా చౌదరి అంటున్నారు. ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తతో వ్యవహరించి ఆచి తూచి ఓటు హక్కు వినియోగించుకోవాలని సుజనా చౌదరి మచిలీపట్నం పర్యటనలో కోరారు. జగన్ మూడేళ్ల పాలన అప్పు చేసి పప్పుకూడు అన్నట్టుగా మారిందని రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మండిపడ్డారు. మచిలీపట్నం పర్యటనలో సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. అన్నపూర్ణగా పేరుగడించిన ఆంధ్రప్రదేశ్ నేడు బీహార్ రాష్ట్రం మాదిరి మారిందని ఎంపీ సుజనా చౌదరి అంటున్నారు. ఆ విషయం బీహార్ వాళ్లే చెబుతున్నారని ఎంపీ సుజనా చౌదరి ఎద్దేవా చేశారు. దశ దిశ లేని పాలన రాష్ట్రంలో సాగుతోందని.. భారతదేశంలోనే హైకోర్టుచే అత్యధిక మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం చరిత్రకెక్కిందని ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. అమరావతి రాజధాని విషయంలో సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారో ఎందుకు వచ్చారో వాళ్లకే తెలియని పరిస్థితి ఉందని ఎంపీ సుజనా చౌదరి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: