ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని అనేక కీలక ప్రాంతాలు రష్యా స్వాధీనంలోకి వచ్చాయి. అయితే.. ఈ ప్రాంతాలను తాము ఆక్రమించామని రష్యా కూడా చెబుతోంది. కానీ.. ఆ ప్రాంతాల నుంచి తమ పౌరులను రష్యా అపహరించుకు వెళ్లిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.

ఇలా యుద్ధం మొదలైనప్పటి నుంచి 12 లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులను రష్యా తమ దేశానికి బలవంతంగా తీసుకెళ్లిందని ఉక్రెయిన్‌ అంటోంది. ఈ మేరకు ఉప ప్రధాని ఇరినా వెరెష్చుక్ కీలకమైన ఆరోపణలు చేశారు. ఈ 12 లక్షల మందిలో 2 లక్షల 40 వేల మంది చిన్నారులు ఉన్నారట. వారిలో 2 వేల మంది అనాథలని కూడా ఉక్రెయిన్‌ ఉప ప్రధాని చెబుతున్నారు. అయితే.. ఈ ఉక్రెయిన్‌, రష్యా రెండు దేశాల వాదనలు భిన్నంగా ఉన్నాయి. రష్యా మాత్రం  20 లక్షల మందికిపైగా ఉక్రెయిన్‌ పౌరులను తమ దేశానికి తరలించినట్లు చెప్పుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: