ఒడిశా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాబోతున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదిని ఖాయం చేశారు. అయితే.. ఈమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే అనేక రికార్డులు ఆమె వశం అవుతాయి. స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రపతులు అయినవారంతా 1947కి ముందు పుట్టినవారే కావడం విశేషం.

ఇక రాష్ట్రపతి అయిన మొదటి గిరిజన మహిళగా కూడా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టిస్తారు. అలాగే రాష్ట్రపతి అయిన రెండో మహిళగా కూడా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టిస్తారు. దేశంలో ఇప్పటివరకు రాష్ట్రపతి పదవి ఎన్నో వర్గాలను వరించింది. కాఅగ్రవర్ణాలు, ముస్లిం మైనార్టీలు, దళిత సామాజిక వర్గానికి చెందినవారు రాష్ట్రపతులు అయినా.. ఇప్పటి వరకూ ఎస్టీలు మాత్రం రాష్ట్రపతి భవన్‌లో పాగా వేయలేదు. ఇప్పుడు ఈ దేశ అత్యున్నత పదవిని ఎస్టీలకు అప్పగించిన గౌరవాన్ని మోదీ తన ఖాతాలో వేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: