అదానీ.. ఇప్పుడు దేశంలోనే అత్యంగా వేగంగా ఎదుగుతున్న బిలియనీర్.. దేశంలోనే కాదు.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. ముకేశ్ అంబానీకి సవాలు విసురుతున్న వ్యాపారవేత్తగా అదానీని చెప్పుకోవచ్చు.అలాంటి అదానీ.. టెలికాం రంగంలోకి ప్రవేశిస్తున్నారా.. అన్న వదంతులు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అదానీ గ్రూప్ స్పందించింది. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడం నిజమేనని ఆ గ్రూప్ ప్రకటించింది.


అయితే వినియోగదారులకు నేరుగా సేవలందించే ఉద్దేశం లేదని అదానీ గ్రూప్ తెలిపింది. తమకు కేటాయించే 5జీ స్పెక్ట్రాన్ని పోర్టులు, ఎయిర్ పోర్టుల్లో సైబర్ సెక్యూరిటీ కోసం వినియోగిస్తామని అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈనెల 26 నుంచి జరగనున్న 5జీ స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ , వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసింది. దీంతో ముకేశ్ అంబానీకి పోటీగా టెలికాం విభాగంలోకి అదానీ వస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకే అదానీ గ్రూప్ క్లారిటీ ఇస్తూ ప్రకటన ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: