ఇవాళ నీట్ పరీక్ష జరగబోతోంది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్, ఏహెచ్ సీట్లు, ఎయిమ్స్, జిప్‌మర్ సీట్లు ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఏడాది పరీక్ష సమయాన్ని 20 నిమిషాలు పెంచిన సంగతి తెలిసిందే. సమయం పెంచినందున 200 నిమిషాల్లో 200 ప్రశ్నల్లో 180కి సమాధానాలు రాయాలి. ఈ పరీక్షకు మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒకనిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదు. ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష రాయొచ్చు.


నీట్ పరీక్షకు వచ్చే వారు ఈ జాగ్రత్తలు పాటించాలి. అడ్మిట్ కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ఫోటో, ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్‌కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రం వెంట ఉంచుకోవాలి. మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. శానిటైజర్ తీసుకెళ్లవచ్చు. వాటర్ బాటిల్, ఆహార పదార్థాలు  అనుమతి ఉండదు.


ఉంగరాలు, బ్రాస్ లెట్లు, చెవి పోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్‌లు, హెయిర్‌ పిన్, హెయిర్‌బ్యాండ్, తాయత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఇందులో వేటిని కూడా లోపలికి అనుమతించరు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులుంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. కచ్చితంగా తెలిసిన సమాధానాలే రాస్తే మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి: