ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలు తగ్గాయట. ఈ విషయాన్ని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఓ సమీక్ష లో తెలిపారు. పోలీసు అధికారులతో సమీక్షించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. మహిళపై జరుగుతున్న నేరాలు తగ్గాయని ఇది మంచి పరిణామమని తెలిపారు. రాష్ట్రంలో 498 కేసులు, నమోదయ్యాయని.. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.  దిశా యాప్ ద్వారా మహిళలు.., పోలీసులను సంప్రదించే సంఖ్య పెరిగిందని.. లోక్ అదాలత్ ద్వారా రాష్ట్రంలో 27వేలు కేసులను పోలీసులు పరిష్కరించారని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

నాటుసారా తయారీ, రవాణా లో కీలకంగా వ్యవహరిస్తున్న గ్రామాల్లో 80శాతం గ్రీన్ గ్రామాలుగా మార్పు చేసామన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. సారా కేసుల్లో నిందితుల పునరావాసం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.  మొదటి దశలో 2,800 కుటుంబాల పునరావాసం కల్పించాలని నిర్ణయించామని.. పునరావాసం కార్యక్రమాలు గ్రామాల వారీగా ఎలా ఉండాలన్నది సర్వే చేపట్టామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: