తాడేపల్లిలో దళిత దివ్యాంగురాలు ఎస్తేర్ రాణి దారుణ హత్యపై జాతీయ మహిళా కమిషన్‍కు తెలుగు మహిళా అద్యక్షురాలు వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశం ముఖ్యమంత్రి నివాసానికి అత్యంత సమీపంలో ఉందని పేర్కొన్న  వంగలపూడి అనిత.. పోలీసు ప్రధాన కార్యాలయం, డిజిపి ఆఫీసులు దగ్గరగా ఉన్నా... తాడేపల్లి ఆంధ్రప్రదేశ్‌కి నేరాల కేంద్రంగా హబ్‌లా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, తగిన పరిహారం బాధిత కుటుంబానికి అందించేలా చూడాలని మహిళా కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో వంగలపూడి అనిత కోరారు. సోషల్ మీడియా మెయిల్‌ ద్వారా జాతీయ మహిళా కమిషన్‌, మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రేఖా శర్మకు వంగలపూడి అనిత ఫిర్యాదు పంపారు. అనిత ఫిర్యాదుకు స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రేఖా శర్మ... రాష్ట్ర పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు సోషల్ మీడియాలో సమాధానం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: