తెలంగాణలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు చక్కటి ప్రోత్సాహం లభిస్తోంది. టీ హబ్‌, టీ హబ్‌ 2, టీ వర్క్స్ వంటి ఇంక్యుబేటర్లతో యువతను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సైబర్‌ టెక్‌ సంస్థ సైబర్‌ వెస్ట్‌.. టి హబ్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో టి హబ్ సీఈఓ మహాంకాళి శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ వెస్ట్ ప్రతినిధులతో ఆయన  సమావేశమయ్యారు.


ప్రజల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై టి హబ్ సీఈఓ మహాంకాళి శ్రీనివాస రావు చర్చించారు. సైబర్‌ సేఫ్టీ నేపథ్యంలో ప్రజలకు మరింత భద్రతకు కల్పించి దిశగా ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సైబర్‌ వెస్ట్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సైబర్‌ స్టార్ట్‌ అప్‌లకు పెట్టుబడులలో చేయందిస్తూ.. సంస్థలను ముందుకు తీసుకెళ్లేందుకు సహాయం అందించేందుకు సైబర్‌ వెస్ట్‌ టి హబ్‌తో సహకరిస్తున్నట్లు సైబర్‌ వెస్ట్‌ ప్రతినిధి మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: