హైదరాబాద్ మెట్రోప్రయాణికులకు రాయితీలో కోత విధించింది. స్మార్ట్ మెట్రో కార్డులు, క్యూఆర్ కోడ్ టికెట్ లకు 10 శాతం రాయితీ సమయాన్ని హైదరాబాద్ మెట్రో కుదించింది. రద్దీ సమయాల్లో రాయితీని పూర్తిగా ఎత్తివేసింది. ఇవాల్టి నుంచి రద్దీలేని సమయాల్లో మాత్రమే 10 శాతం రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ... రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే రాయితీ వర్తించనున్నట్లు హైదరాబాద్ మెట్రో పేర్కొంది.


ఇక కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్స్ ధర భారీగా హైదరాబాద్ మెట్రో పెంచింది.  సూపర్ సేవర్ కార్డు 99 రూపాయలకు పెంచింది. గతంలో ఇదీ 59 రూపాయలుగా ఉంది. గతంలో 59 రూపాయలతో కార్డు తీసుకున్న వారు.... సూపర్ సేవర్ 99 రీఛార్జీ చేసుకోవచ్చని హైదరాబాద్ మెట్రో వెల్లడించింది. కొత్తగా తీసుకునే వారు మాత్రం 100 రూపాయలకు పెంచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: