బ్రో సినిమాలో తనపై పేరడీ సీన్ పేరుతో హేళన చేసిన పవన్‌పై నేరుగానే అంబటి రాంబాబు స్పందించి.. పవన్‌పై విమర్శలు గుప్పించేశారు. పవన్ సినిమాలో తన క్యారెక్టర్‌ను పెట్టి అవమానించారని విన్నానని అంబటి రాంబాబు అన్నారు. అయితే.. పవన్‌ది శునకానందమని.. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. సంక్రాంతికి తాను వేసింది ఆనంద తాండవమని.. ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రిని అయిన ఆనందమని.. తాతను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకునో, ప్యాకేజీ తీసుకునో డ్యాన్సులు చేయనని అంబటి రాంబాబు అన్నారు. నా డ్యాన్స్ సింక్ అవ్వడానికి నేనేమైనా డ్యాన్స్ మాస్టర్‌నా అంటూ ఎద్దేవా చేశారు. అసలు రాజకీయాలకు పవన్ సింక్ అవ్వడని అంబటి రాంబాబు అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి