గత రెండు సంవత్సరాలుగా ఆంధ్ర ప్రాంతపు అప్పు పది లక్షల కోట్లు అని వ్రాసుకుంటూ వస్తున్నాయి కొన్ని పత్రికలు. అయితే ఆ మాటల్లో నిజం లేదని సాక్షాత్తు కేంద్ర మంత్రి చెప్పినా కూడా ఎఫ్‌ఆర్‌ బీఎం నిబంధనలకు వ్యతిరేకమంటూ చెప్పుకొచ్చారు వాళ్ళు. అయితే దీనిపై ఈనాడు పన్నులు వాటా పెరిగినా అప్పులు తగ్గలేదని వ్రాసుకొచ్చింది. తెలుగుదేశం హయాంలో రుణ జిఎస్టి సగటు నిష్పత్తి 28.32 శాతం ఉన్నది అని తెలుస్తుంది.

కానీ అది వైసిపి హయాం లోకి వచ్చేసరికి 32.56 శాతానికి పెరిగింది. ఏపీకి కేంద్రం ఇచ్చే పన్నుల వాటా శాతం పెరిగినా అప్పులు చేయడం మాత్రం తగ్గలేదు అంటున్నారు. జీఎస్టీ బిల్లు లో రాష్ట్ర అప్పుల శాతం 32.89 శాతం పెరగడమే దీనికి నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జీఎస్టీపి అప్పుల నిష్పత్తి శాతం 30% లోపే ఉండేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: