ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే.. అది చివరకు కాంగ్రెస్ లాభపడిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంవల్ల గోస పడుతున్న ప్రజలను చైతన్యం చేసేందుకు పోరాడింది బీజేపీయేనని కానీ లాభపడింది కాంగ్రెస్ అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రజలను రాచిరంపాన పెట్టిన కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడామని..  ఎంతోమంది కార్యకర్తలపై కేసులు పెట్టారని... దాడులు చేశారని... జైలుకు పంపారని.. కానీ దురద్రుష్టవశాత్తు ప్రజలు మమ్ముల్ని ఆదరించలేదని బీజేపీ నేతలు అంటున్నారు.

అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన పీడ విరగడైనందుకు మాకు చాలా సంతోషంగా ఉందంటున్న బీజేపీ నేతలు.. కేటీఆర్ అధికారంలో ఉన్నన్నాళ్లు మీడియాకు విలువ ఇవ్వలేదని..అహంకారంతో విర్రవీగారని.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఎక్కడ లేని గౌరవం ఇస్తున్నారని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, మెజారిటీ సీట్లు సాధించిన రేవంత్ రెడ్డికి ఆ పార్టీ అభినందనలు చెబుతోంది. బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేశారని..ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి లాభపడాలని చూశారని.. కానీ చివరకు బీఆర్ఎస్ ఓడిందని వారు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

BJP