సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక, ఇంధన శాఖను కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల, పౌరసరఫరాల శాఖలను  కేటాయించారు. ఇక దామోదర రాజనర్సింహకు వైద్య, ఆరోగ్య శాఖ కేటాయించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆర్ అండ్ బి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -  రెవెన్యూ,  ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖలు కేటాయించారు.


పొన్నం ప్రభాకర్‌కు రవాణా, బీసీ సంక్షేమం శాఖలను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. కొండా సురేఖకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలను కేటాయించారు. సీతక్కకు  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమం శాఖలను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ శాఖలను కేటాయించారు. శ్రీధర్ బాబు - ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు, జూపల్లి ఎక్సైజ్, పర్యాటకశాఖలను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: