రాముడి ప్రాణప్రతిష్ఠకు అయోధ్యానగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఇవాళ బాలరాముడి విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయిస్తారు. ప్రాణప్రతిష్ఠ వేడుకకు కర్తలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు పాల్గొంటాయి. రామాలయం ప్రారంభోత్సవం కోసం వేలాదిగా అయోధ్యకు సాధువులు చేరుకున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 4 వేల మంది సాధువులు పాల్గొంటారు.

అందుకే బహుళస్థాయి భద్రతా వలయంలో అయోధ్యానగరం ఉంది. ప్రధాని, పలువురు ప్రముఖుల సందర్శన దృష్ట్యా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో యూపీ పోలీసులు, ఏటీఎస్‌ కమాండోలు మోహరించారు. సీఆర్‌ఎపీఫ్‌ దళాలు మోహరించారు. యాంటీ డ్రోన్ జామర్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అయోధ్యలో 10 వేలకుపైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. అయోధ్యకు వెళ్లే అన్నిమార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.
యూపీలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పోలీసులు పంపిస్తున్నారు. సరయూ నది వెంబడి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు మోహరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: