రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్.. ఈ సందర్భంగా యువ భారతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో యువత సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. యువత వేగంగా మార్పులు కోరుకుంటుందన్నారు. ఇప్పటి న్యాయ వ్యవస్థలోని ఆలస్యాన్ని సహించేంత ఓపిక నేటి యువతలో లేదని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
సత్వర న్యాయం కావాలని యువభారతం ఆశిస్తోందని.. దాన్ని అందుకునేంతగా కోర్టులు మారాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆకాంక్షించారు.


కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ఇటీవల ఈ కోర్టు పథకంలో భాగంగా పలుచోట్ల ఈ సేవ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ వాడుకోవాలన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

law