ఎస్బిఐ కొత్త కొత్త ప్లాన్ లను తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్ లను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.  ఈ ప్లాన్ తో ప్రజలకు లాభం చేకూరుతోంది.  ఇన్వెస్ట్ అంటే వేలాది రూపాయలు కావాలని, అంత డబ్బులు ఉంటె ఇలా ఎందుకు కష్టపడం అని చాలా మంది అనుకుంటున్నారు.  వీరందరికి లబ్ది చేకూర్చేందుకు ఎస్బిఐ కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.  అదే రీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్.  వెయ్యి రూపాయల డబ్బును ఇన్వెస్ట్ చేస్తే... దానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి పెట్టిన డబ్బుకు వడ్డీని అకౌంట్ లో వేస్తారట. 


ఈ ఇన్వెస్ట్ మెంట్ మెట్యూరిటి 6 ఈనెల నుంచి 10 ఏళ్ళ వరకు ఉంటుంది.  ఆరు నెలల తరువాత ప్రతి మూడు నెలలకు ఒకసారి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించి వడ్డీని మీ అకౌంట్లో పడిపోతుంది.  ఆ వడ్డీని కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.  ఈ వడ్డీకి కూడా చివర్లో మీకు వడ్డీ వస్తుంది. వేయి రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.  అంతేకాదు, రీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పై లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంటుంది.  


90శాతం వరకు దీనిపై లోన్ తీసుకోవచ్చు.  మెట్యూరిటి అమౌంట్ తీసుకునే సమయంలో టీడీఎస్ కట్ అవుతుంది.  టీడీఎస్ కేవలం 2శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది.  ఈ రీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ను మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడుతుందని అంటున్నారు.  బయట ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా.. దానికి సంబంధించిన డబ్బులు వెనక్కి వస్తాయో లేదో తెలియదు.  కానీ, ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో డబ్బులు పెడితే గ్యారెంటీగా మనీ డబుల్ అవుతాయని అంటున్నారు.  


యూత్ కూడా పాకెట్ మనీలో కొంతభాగం ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. దానిపై కొంతకాలం తరువాత లోన్ తీసుకొని దానితో బిజినెస్ ప్రారంభించవచ్చు. ఇది అందరికి ఆమోదయోగ్యమైన ప్లాన్ అని, తప్పకుండా అందరికి ఉపయోగపడుతుందని అంటున్నారు ఇన్వెస్టర్లు.  మరి ఎంతమంది దీనిని వినియోగించుకుంటారో చూడాలి.  తక్కువ మొత్తంలోనే కాబట్టి తప్పకుండా అందరికి ఉపయోగపడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: