కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోగా... తమ దేశాలకు ఎక్కడ ఈ వైరస్ పాకుతుందో అన్న ఆందోళనలో  ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా, అలాగే ఈ వైరస్ కు మందులను పూర్తి స్థాయిలో తయారు చేసి అందుబాటులో ఉంచేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇక మనదేశంలోనూ ఈ వైరస్ ఎఫెక్ట్ బాగానే పడింది. హైదరాబాదులో ఇప్పటికే కొన్ని కేసులను గుర్తించి వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఎయిర్ పోర్ట్స్ లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ వైరస్ మరింతగా విస్తరించకుండా తగిన జాగ్రత్తలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకుంటోంది.


 ఇంతవరకు ఈ వ్యవహారం ఇలా నడుస్తూనే ఉండగా .. ఇప్పుడు ఈ వ్యవహారం మిగతా వాటిపైనా బాగా పడింది. ముఖ్యంగా కోడి మాంసం తినవద్దని ఇప్పటికే వైద్యులు సూచనలు ఇస్తున్నారు. దీంతో ఆ ఎఫెక్ట్ కోడి రైతుల మీద పడింది. తాజాగా ఈ ఎఫెక్ట్ రొయ్య రైతులను కూడా బావురమనేలా చేస్తోంది. ఏపీలో పెంచే రొయ్యలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉండి. ఇక్కడ నాణ్యమైన రొయ్యలు పెంచడంతో వీటికి  చైనా, జపాన్ లలో డిమాండ్ ఎక్కువ. అందుకే ఎక్కువగా ఆ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు వ్యాపారాలు. 


కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఆ దేశానికి ఎగుమతి దిగుమతులపై నిషేధం విధించారు. దీని కారణంగా రొయ్యల ఎగుమతులు ఆగిపోయాయి. వారం రోజుల నుంచి నాణ్యమైన రొయ్యలకు కూడా పెద్దగా ధర రావడంలేదు. అలాగే రోజు రోజుకి ధర పడిపోతుండడంతో భారీగా నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అన్ని రకాల కౌంట్ రొయ్యల ధర కేజీకి 30 వరకు తగ్గినట్టు తెలుస్తోంది.  ఎక్కడ తమ దేశానికి కరోనా వైరస్ వస్తుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా  దిగుమతులపై నిషేధం విధించారు. 


వాస్తవంగా చైనా కు ఇక్కడ నుంచి ఎగుమతులు తక్కువే అయినా మిగతా దేశాలు దిగుమతులు చేసుకునేందుకు వెనకంజ వేస్తున్నాయి. మేత ధరలు రోజు రోజుకి పెరిగిపోతుండటం... రొయ్య ధరలు తగ్గడంతో పాటు ఎగుమతులపై నిషేధం ఉండడంతో రొయ్య  రైతులు లబోదిబోమంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: