ఇదివరకు భారతదేశంలో ఓ వెలుగు వెలిగిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్. చైనా మొబైల్స్ అమ్మకాలు ఊపందుకోవడంతో భారతదేశానికి చెందిన మైక్రోమాక్స్ సంస్థ సేల్స్ మరుగున పడిపోయాయి. మళ్లీ ఇప్పుడు తన పూర్వవైభవాన్ని సంపాదించుకునేందుకు మైక్రోమ్యాక్స్ రంగం సిద్ధం చేస్తోంది. భారతదేశంలో చైనా దేశం కు సంబంధించి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో మళ్లీ మైక్రోమ్యాక్స్ భారతదేశంలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మైక్రోమ్యాక్స్ సంస్థ ఛైర్మెన్ రాహుల్ శర్మ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


భారతదేశంలో చైనా మొబైల్ సంస్థలు పోటీ రావడం సహజమే కానీ.. సరిహద్దుల్లో అనిశ్చితి సరైనది కాదంటూ ఆయన చైనా దేశం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆ వీడియోలో రాహుల్ శర్మ తన ఓ సామాన్యుడు ఉపాధ్యాయుడు కుమారుడిగా తన వ్యాపార ప్రస్థానంని ఏ విధంగా రూపొందించాడో ఆ వీడియోలో వివరించాడు. ప్రపంచంలోనే టాప్ టెన్ బ్రాండ్స్ లో మైక్రోమ్యాక్స్ ను నిలిపిన ఈ నేపథ్యంలో మైక్రోమాక్స్ జర్నీని ఆయన చెప్పుకొచ్చారు. అయితే సంస్థలో జరిగిన కొన్ని పొరపాట్ల కారణంగా తాను వ్యాపారంలో హెచ్చుతగ్గులు చూశానని అయితే తాను ఓడిపోలేదని సాధించిన మొత్తంతో తాను సంతృప్తి చెందానని చెప్పుకొచ్చారు. కాకపోతే భారత్-చైనా దేశాల సరిహద్దుల వద్ద ఏం జరిగిందో అది మంచి పద్ధతి కాదని ఆయన తప్పుబట్టారు. అయితే మళ్లీ తన బిజినెస్ ను మొదలు పెట్టే నేపథ్యంలో తాను ఈసారి వ్యాపారాన్ని దేశం కోసం చేస్తాం అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిబ్బర్ భారత్ లో భాగంగా తాను భారత దేశం కోసం మైక్రోమ్యాక్స్ ఇన్ అనే సరికొత్త స్మార్ట్ఫోన్ బ్రాండ్ తో తిరిగి వస్తుందని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించి బ్లూ బాక్స్ ను కూడా వీడియోలో ఆయన షేర్ చేశారు.


ఇకపోతే ఆ ఫోన్ ధర ఎంత ఉంటుందో క్లారిటీగా చెప్పకపోయినా మైక్రోమాక్స్ సంస్థ కొత్తగా 7 నుంచి 15 వేల రూపాయల మధ్య వారి ఉత్పత్తులను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి నెలలో మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ లను బడ్జెట్ ధరలో ఆవిష్కరించబోతున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: