ప్రైవేట్ దిగ్గజ వాణిజ్య బ్యాంకులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒకటి..ఈ బ్యాంక్ మిగిలిన బ్యాంకులతో పోలిస్తే కస్టమర్లకు ఎప్పుడు కొత్త  ఆఫర్లను అందిస్తూ వస్తుంది. ఖాతాదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తూ ప్రముఖ బ్యాంక్ గా కొనసాగుతుంది. అందుకే ఈ బ్యాంకు ను ఎక్కువ ప్రైవేట్ రంగాల వారికి ఉపయోగకరం.. మల్టీ నేషనల్ కంపెనీలు ఈ బ్యాంక్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకా తన వ్యాప్తిని పెంచుకునేందుకు మరిన్ని అవకాశాలను అందిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు మరో శుభవార్తను కష్టమర్లకు అందించింది..



దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బ్యాంక్ తాజాగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు తీసుకువచ్చింది. అలాగే ఇతర ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లు వ్యాపారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవెంటంటే..మెట్రో, సెమీ అర్బన్, రూరల్ మార్కెట్లలోని వ్యాపారులు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందొచ్చు. బ్యాంక్ మర్చంట్ యాప్, క్యూఆర్ కోడ్, పీఓఎస్ మెషీన్ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా మర్చంట్లు క్యాష్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐ లావాదేవీలకు కూడా ఆఫర్లు వర్తిస్తాయి.క్యాష్ బ్యాక్ ఉండటంతో చాలా మంది ఈ బ్యాంక్ లో ఖాతాను ఓపెన్ చేయడానికి ముందుకు వస్తున్నారు..



ఇంకొక విషయమేంటంటే..దేశవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌లోని చిన్న మధ్య తరహా వ్యాపారులు అందరికీ ఫెస్టివ్ ట్రీట్స్ ఆఫర్లను విస్తరిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హెడ్ పరాగ్ రావు వెల్లడించారు..డిజిటల్ ఇండియా దిశగా వడివడిగా అడుగులు వేస్తూ వెళ్లాలంటే మర్చంట్ నెట్‌వర్క్ కూడా బలోపేతం కావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ బెనిఫిట్స్ ను చిరు వ్యాపారులు ఉపయోగించుకుంటే కస్టమర్లకు కూడా ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు. మిగిలిన బ్యాంకుల తో పోలిస్తే లావా దేవీలకు ఈ బ్యాంక్ ఉపయోగ పడుతుండటంతో చాలా ఈ బ్యాంక్ కు మారిపోతున్నారు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: