
ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది. సాధారణంగా సినిమాల్లో ఫన్ జనరేట్ చేయడం కోసం ఏకంగా చిత్ర విచిత్రమైన కారణాలు చెప్పి కోడిపుంజును లేకపోతే కుక్కలను లేదా రామచిలక లాంటి పక్షులను కూడా పోలీసులు అరెస్టు చేసి బంధించడం లాంటివి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇలాంటివి చూసి నవ్వుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. కానీ నిజజీవితంలో ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇలాంటిదే జరిగింది.
మద్యం అక్రమ రవాణా విషయంలో ఏకంగా రామచిలుకను అరెస్టు చేసి బంధించారు పోలీసులు. ఈ ఘటన బీహార్ లోని గయాలో వెలుగు చూసింది. గురువాలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. గ్రామంలో అమృత్ మల్ల అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు చాకచక్యంగా అతని ఇంటిపై దాడులు నిర్వహించారు. అయితే పోలీసులు వస్తున్న విషయాన్ని అతను ప్రేమగా పెంచుకుంటున్న రామచిలుక తన పలుకులతో ముందుగానే యజమానికి చెప్పింది. దీంతో అతని ఫ్యామిలీ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంది. అయితే ఇక ఇలా నేరస్తుడికి సహాయం చేసిన రామచిలుకను బంధించి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు పోలీసులు. ఇక ఈ ఘటన కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.