కావాల్సిన పదార్ధాలు....
ప్రధాన పదార్థం...
1 కప్ బియ్యం
ప్రధాన వంటకానికి....
2 కప్ నీళ్ళు
అవసరాన్ని బట్టి ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు
అవసరాన్ని బట్టి ఉప్పు
పోపు కోసం...
1 టేబుల్ స్పూన్ జీలకర్ర
టెంపరింగ్ కోసం...
1 టేబుల్ స్పూన్ నెయ్యి
తయారు చేయు విధానం....
ఓ కుక్కర్ తీసుకోండి.. అందులో సగం నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడి అయిన తర్వాత జీలకర్ర వేసి వేయించండి. జీలకర్ర చిటపటలాడుతుండగా.. అందులోనే పచ్చిమిరపకాయలు వేసి వేయించండి. ఇప్పుడు ఆ పోపు మిశ్రమంలో కడిగిన బియ్యం వేసి అన్ని పదార్థాలు కలిసే వరకూ ఓ నిమిషం పాటు వేయించండి.
బియ్యం కాస్తా వేగాక.. అందులో కొద్దిగా ఉప్పు వేయండి. ఇప్పుడు నీరు వేసి కుక్కర్ మూత పెట్టండి. ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించండి. ఇప్పుడు స్టౌ ఆపేసి కాసేపు ఆవిరిపై అలానే ఉంచండి. ఓ చిన్న పాన్ తీసుకుని అందులో కాస్తా నెయ్యి వేసి వేడి చేయండి. అందులోనే జీడిపప్పు వేసి వేయించండి.
ఇలా తయారైన జీరా రైస్‌ని ఓ గిన్నెలోకి తీసుకుని వేయించిన జీడిపప్పులు వేసి గార్నిష్ చేయండి. జీరా రైస్‌ని గ్రేవీతో కూడా కలిపి తీసుకోవచ్చు.