ప్రస్తుతం కాలంలో అన్నిటిలోనూ కల్తీ కనిపిస్తుంది. కడుపు నిండా తినాలనుకున్న కూడా చేయలేకున్నాము.. ఎక్కడ ఏది విషయమై శరీరాన్ని పాడు చేస్తాయని భయపడుతున్నారు. అయితే గుమ్మడికాయ తో చేసిన ఏ వంటకం అయిన కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని న్యూట్రీషన్లు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఏ వంటలు చేసుకుంటే మంచి రుచితో పాటుగా ఆరోగ్యం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..



నర దిష్టిని దరి చెరనివ్వకుండా కాపాడే కాయ గుమ్మడి కాయ.. ఈ కాయను సాంబార్లలోనూ , హల్వాలలోను పచ్చడిలో ఎక్కువగా వాడుతుంటారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని వంటల్లో ఈ కాయను వాడవచ్చునని అంటున్నారు..అవేంటో ఇప్పుడు చూద్దాం..



గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యత పొందుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు గుమ్మడికాయ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు..


గుమ్మడి గింజల స్మూతీ..

గుమ్మడి గింజలను తీసుకొని, వాటికి సన్నగా తరిగిన అరటి కాయ ముక్కలను కలపాలి.. కొన్ని పాలు, కొన్ని నీళ్ళు వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన స్మూతీ రెడీ..

కొంత మంది కారం ను ఇష్టపడుతుంటారు.. అలాంటి వారు గుమ్మడి గింజల తో పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు ఎలానో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు..

గుమ్మడి గింజలు : ఒక కప్పు ( రాత్రంతా నాన బెట్టాలి)

అల్లం : కొద్దిగా

వెల్లుల్లి : మూడు రెబ్బలు

పచ్చి మిర్చి : మూడు

కారం : ఒక స్పూన్

కొత్తిమీర : కొద్దిగా

ఉప్పు : రుచికి సరిపడా

ఆలివ్ ఆయిల్ : రెండు స్పూన్లు

తయారీ విధానం..


ముందుగా నాన పెట్టిన గింజలను తీసుకొని, పైన తెలిపిన పదార్థాలను అన్నిటినీ కలిపి రుబ్బుకోవాలి.. అందులో అర చెంచా నిమ్మరసం కూడా వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అన్నంలోకి, లేదా చపాతిలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది.

.చూసారుగా గుమ్మడి కాయతో ఎంత రుచికరమైన వంటలను కూడా చేసుకోవచ్చనో.. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: