ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. వంకాయ వంటి కూర లేదు అంటారు. అవును వంకాయ ఎంతో రుచికరమైన కూరను తయారు చేసుకోని తింటే ప్రాణం జివ్వుమంటుంది. అంత రుచికరంగా ఉంటుంది వంకాయ. ఇక వంకాయతో రుచికరమైన రోల్స్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...


బ్రింజాల్ రోల్స్ తయారు చెయ్యడానికి కావలసిన పదార్ధాలు....

వంకాయలు  – 3 లేదా 4 (పొడవైనవి), ఆలివ్‌ నూనె – 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి – అర టీ స్పూన్‌, నీళ్లు – 2 టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం – 4 టేబుల్‌ స్పూన్లు, ఉడికించిన బియ్యం రవ్వ – ముప్పావు కప్పు, అవకాడో – 1, నూనె – డీప్‌ ప్రైకి సరిపడా, టమాటా ముక్కలు – పావు కప్పు, జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు, బీట్‌ రూట్‌ తురుము – 3 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, పుదీనా తరుగు – 1 టేబుల్‌ స్పూన్లు, క్యారెట్‌ – 3, వేరుశనగలు – పావు కప్పు (రవ్వలా మిక్సీ పట్టుకోవాలి), ఉప్పు – తగినంత....

బ్రింజాల్ రోల్స్ తయారు చేయు విధానం....

ముందుగా వంకాయలను శుభ్రం చేసుకుని, కాడలు తొలగించి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో ఆలీవ్‌ నూనె, ఉప్పు, మిరియాల పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం, నీళ్లు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఓ పాన్‌లో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే వేరుశనగ రవ్వ, బీట్‌రూట్‌ తురుము, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి.ఇప్పుడు అందులో ఉడికించిన బియ్యం రవ్వను కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో ఆలివ్‌ మిశ్రమం కూడా వేసుకుని, చివరిగా సరిపడా ఉప్పు వేసుకుని, బాగా కలుపుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికిన వంకాయలను పొడవుగా  కట్‌ చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని, అందులో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచుతూ రోల్స్‌లా చుట్టుకుని కొత్తిమీర లేదా పుదీనాతో గార్నిష్‌ చేసుకుని, టమాటా సాస్‌తో కలుపుకొని తింటే భలే రుచిగా ఉంటాయి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: