కూరలు తిని తిని బోర్ కొట్టిన వారికి ఒకసారి ఈ చారు రుచి చూడండి. రెండు ముద్దలు అన్నం ఎక్కువ తింటారు. అలాగే సెనగ పప్పుతో చారు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా శెనగపప్పు చారు ఎలా పెట్టాలో చూద్దామా. ముందుగా కావలిసిన పదార్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా. !

కావలిసిన పదార్ధాలు :

సెనగ పప్పు – అర కప్పు
ఉప్పు- తగినంత
చింత పండు-కొద్దిగా
కారం-చెంచా
ధనియాల పొడి-చెంచా
పసుప- చెంచా
చిటికెడు-ఇంగువ
పచ్చి మిర్చి-రెండు
ఉల్లి పాయ- ఒకటి
కొబ్బరి తురుము- రెండు చెంచాలు
నీళ్లు-కొద్దిగా
నూనె- తగినంత
ఆవాలు-ఆర చెంచా
జీల కర్ర-అరచెంచా
కరివేపాకు-కొద్దిగా

తయారీ విధానం…

ముందుగా కొద్దిగా చింత పండును నాన పెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సెనగపప్పుని కుక్కర్ లో పెట్టి నీళ్లు పోసి మెత్తగా అయ్యేవరకు  ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో సెనగ పప్పు ఉడికిన తరువాత మెత్తగా మెదిపి అందులో కొన్ని నీళ్లు  పోసి ఉల్లి పాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, పచ్చి మిర్చి, ధనియాల పొడి, కొద్దిగా ఇంగువ వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానపెట్టుకున్న చింత పండు పులుసు కూడా పోసి మరిగించాలి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించి  ఒక బాండీ పెట్టి అందులో నూనే వేసి వేడి అయ్యక ఇందులో ఆవాలు, జీలకర్ర, సాయి మిన పప్పు,  కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి.చారు మరిగిన తర్వాత  కొత్తి మీర, కొబ్బరి పొడి వేసి దించాలి. అంతే రుచికరమైన చారు రెడీ అయినట్లే. వేడి వేడిగా శెనగపప్పు చారు పోసుకుని అప్పడాలు గాని, వడియాలు కానీ వేసుకుని తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రసం రెసిపీ ని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: