హైదరాబాద్ లో ఆన్లైన్ వ్యభిచారం జోరుగా నడుస్తోంది. పోలీసులు కఠిన చర్యకు తీసుకున్నా...ఈ పని చేసేవారు కొత్త దారులను వెతుకుంటున్నారు. ఇక ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించి విటులను ఆకర్షిస్తున్నారు. తాజాగా అమ్మాయిలను హోమ్ డెలివరీ చేస్తున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు గుర్తించారు. చాకచక్యంగా ఆ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....రచకొండ ఎస్ఓటీ పోలీసులు చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా హైటెక్ వ్యభిచార గుట్టు రట్టయ్యింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కనికిపాడు మండలం ఎదుగుపుల్ల గ్రామానికి చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తి ఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వంశీ కృష్ణ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి అడ్డదారులు వెతుకున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నడు. దానికోసం ఓ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి తమ వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు ఉన్నారంటూ ప్రకటన ఇచ్చాడు.

హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం..లోకేషన్ పంపితే హోమ్ డెలివరీ.!అంతే కాకుండా వాట్సాప్ లో లోకేషన్ షేర్ చేస్తే క్షణాల్లో అమ్మాయి మీ ముందు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నాడు. అయితే ఈ ప్రకటనలో వంశీ కృష్ణ తన నంబర్ ను షేర్ చేసాడు. కాగా ఆన్లైన్ మోసాలపై ఎప్పరికప్పుడు అప్రమత్తంగా ఉండే రాచకొండ పోలీసుల కంట ఈ ప్రకటన పడింది. దాంతో వారు డెకాయ్ ఆపరేషన్ ను చేపట్టారు. వంశీ కృష్ణ ఫోన్ నంబట్ కు కాల్ చేసి అమ్మాయిలు కావాలని అడిగారు. పోలీసులు కుశాయిగూడ లోకేషన్ ను షేర్ చేయగా వంశీకృష్ణ అస్సామ్...బెంగాల్ రాష్ట్రాలకి చెందిన అమ్మాయిలను తీసుకుని లోకేషన్ కు వచ్చాడు. అక్కడ సివిల్ డ్రెస్ లో ఉన్మ పోలీసులు వంశీకృష్ణ ను అదుపులోకి తీసుకున్నారు.  అమ్మాయిలిద్దరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వంశీ కృష్ణ పై వివిధ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: