పెళ్లి జరిగి మూడు వారాలు అయింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో ఆ నవ వధువు కనిపించకుండా పోయింది. ఎవరితో పోయిందో ఎక్కడికి పోయిందో ఇప్పటివరకు సమాచారం తెలియలేదు. అయితే దీనిపై తన భర్తకు అనేక అనుమానాలు వస్తున్నాయి. పెళ్లికి ముందు ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా. ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా  అనే రీతిలో ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు. అయితే తెలిసీ తెలియని వయసులో తల్లిదండ్రులు వారి మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా బలవంతపు పెళ్లిళ్లు చేసి సాగనంపుతున్నారు. దీంతో  వారు పెళ్లి తర్వాత  ఈవిధంగా పారిపోతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది.

 హైదరాబాద్ నగరంలోని  నల్లకుంట పీఎస్లో తన భార్య ఓ యువకుడితో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడో యువకుడు. ఆమె వివాహం చేసుకొని  మూడు వారాలు మాత్రమే అయింది. దీంతో భర్త కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బాలాజీనగర్లో నివాసముండే బుడుగుల సాయికుమార్ కు సిద్దిపేట జిల్లా తొగుట మండలానికి చెందిన అంజయ్య కుమార్తె నాగమణి 20 సంవత్సరాల అమ్మాయి. ఈమెకు సాయి కుమార్ తో మే 30 వ రోజున వివాహం జరిగినది. రోజు మాదిరిగానే  సాయికుమార్ ఆఫీస్ కి వెళ్ళాడు. మధ్యాహ్నం  సమయంలో వదిన రేణుక  సాయికుమార్ కి ఫోన్ చేసి నీ భార్య కనిపించడం లేదని సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే ఇంటికి వచ్చిన సాయికుమార్ ఇల్లును చూసి షాక్ అయ్యాడు. ఎక్కడి బట్టలు అక్కడే ఉన్నాయి. బీరువా తెరిచి ఉన్నది.  బీరువాలోని బంగారం, బట్టలు, డబ్బులు కనిపించలేదు.

 బీరువాలో నాగమణి సెల్ఫోన్ గమనించిన సాయి కుమార్ దాన్ని తీసుకొని పరిశీలించాడు. అందులో ఆమె ఒక యువకుడితో చేసిన చాటింగ్ బయటపడింది. దీంతో తన భార్య కనిపించడం లేదంటూ సాయికుమార్ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగమణి యొక్క ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అయితే నాగమణిని పెళ్లికి ముందే ఓ యువకుడు తీసుకుపోయాడని, ఇప్పుడు కూడా అతని హస్తమే ఉండవచ్చని తను ఇచ్చిన ఫిర్యాదులో సాయికుమార్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: