తెలుగులో ఒకప్పుడు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అందరు స్టార్ హీరోలతో నటించిన రకుల్, ప్రస్తుతం టాలీవుడ్‌కు దాదాపు దూరమయ్యారు.ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతూ.. "నేను తెలుగు సినిమాలను, ఇక్కడి ప్రేక్షకులను చాలా మిస్ అవుతున్నాను. మంచి కథ దొరికితే వెంటనే రీ-ఎంట్రీ ఇస్తాను" అని తన మనసులోని మాటను బయటపెట్టారు. 'బాహుబలి' వంటి భారీ పీరియడ్ చిత్రంలో నటించాలన్నది తన డ్రీమ్ అని, అలాంటి పాత్ర కోసం వేచి చూస్తున్నానని ఆమె తెలిపారు.
రకుల్ చివరి స్ట్రెయిట్ తెలుగు సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లు దాటిపోయింది. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నా, తెలుగులో ఉన్న క్రేజ్ అక్కడ దక్కడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఆమెకున్న ఫిట్‌నెస్ మరియు అంకితభావం చూస్తుంటే, ఒక సరైన హిట్ పడితే మళ్ళీ టాలీవుడ్‌లో బిజీ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.
రాకుల్ ప్రీత్ సింగ్ తన ప్రొఫెషనల్ మరియు పర్సనల్ లైఫ్‌ను చాలా బ్యాలెన్స్‌డ్ గా లీడ్ చేస్తున్నారు. అటు జాకీ భగ్నానీతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, ఇటు కెరీర్‌ను పరుగులు తీయిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి