ఆమెకు వివాహమై రెండు నెలలు మాత్రమే అయింది. అంతలోనే ఆ వివాహిత విగతజీవిగా పడిపోయింది. రక్తం మడుగులో తన ప్రాణాలు వదిలింది. ఈ పాపం ఎవరిది. ఆ వివాహితని ఎవరు చంపారు. చంపేంత పని ఏం చేసింది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు  కారణమా.. లేదా ఏవైనా గొడవలు జరిగాయా.. గుర్తుతెలియని వ్యక్తులు చేశారా.. పథకం ప్రకారమే జరిగిందా..? అసలు ఏం జరిగింది..? ప్రణాళిక ప్రాణం ఎందుకు పోయింది.. రెండు నెలలు కాపురం  అంతలోనే దారుణం ఎలా జరిగింది..

 మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మనిషి ప్రాణాలు అంటే లెక్కలేకుండా గాల్లో కలుపుతున్నారు. వారు కూడా మన లాంటి మనిషే కదా అని ఆలోచన మరిచారు. కోళ్లను కోసినంత ఈజీగా మనుషుల పీకలు కోస్తున్నారు. ఇంతటి దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నారు. ఏ సమస్య ఉన్నా చంపడం అనేది పరిష్కారం కాదు కదా. ఎన్నో చట్టాలు, న్యాయస్థానాలు ఉన్న నేర ప్రవృత్తి మాత్రం ఆగడం లేదని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లా  చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామం లో  ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి  సాయంకాలం పూట అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. అసలు ఎందుకు చేశారు. వివరాల్లోకి వెళితే  హుజూరాబాద్ పట్టణంలోని మామిండ్ల వాడకు చెందిన ప్రణాళికతో, బొమ్మనపల్లి గ్రామానికి చెందిన  మేదరి అనిల్  28 సంవత్సరాల యువకుడితో  గత రెండు నెలల క్రితం వివాహం జరిగినది. అనిల్ హుస్నాబాద్ పట్టణంలోని ఒక బ్యాటరీ షాప్ లో బ్యాటరీ రిపేర్ చేసే పని చేస్తాడు. ప్రతిరోజు హుస్నాబాద్ కు పని కోసం వెళతాడు.


రోజులాగే శుక్రవారం కూడా  ఉదయం హుస్నాబాద్ లోని బ్యాటరీ షాప్ కి వెళ్ళాడు. మృతురాలి అత్తమామలు  రాజయ్య, రాజవ్వలు వ్యవసాయ పనుల కోసం పొలం దగ్గరికి వెళ్ళారు. ఇంట్లో ప్రణాళిక  ఒక్కతే ఉన్నది. ఇంటికి తిరిగి వచ్చాక రాజయ్య, రాజవ్వలు కోడలు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి  బోరున విలపించారు. పొలం వద్దకు వెళ్లే సమయంలో క్షేమంగా ఉన్న తమ కోడలు తిరిగి వచ్చేసరికి ఇలా మృతి చెంది  విగతజీవిగా పడి ఉండడం చూసి వారు తీవ్రంగా రోదించారు. వారి బోధనలు విన్న చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ సిపి కమలాసన్రెడ్డి , సీఐ శశిధర్ రెడ్డి , ఎస్ఐ మధుకర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి. క్లూస్ టీం తో పరిశీలన చేస్తున్నారు. అసలు హత్య ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: