
అయితే ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు అంతకంటే దారుణంగా వ్యవహరించాడు. తోటి విద్యార్థిని కొట్టాడు అన్న కారణంతో ఒక విద్యార్థి పట్ల ఆ పాఠశాల ప్రిన్సిపల్ ప్రవర్తించిన తీరు కాస్త ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. అంతే కాదు ఇది ప్రస్తుతం వివాదాస్పదంగా మారిపోయింది. సాధారణంగా విద్యార్థులు అల్లరి చేస్తే బెత్తంతో మందలించడం లాంటివి చూశాము. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ మాత్రం ఏకంగా బిల్డింగ్ పై అంతస్థు నుంచి విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసాడు. దీనికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతుంది ఇక ఆ ప్రిన్సిపాల్ చేసిన పని చర్చనీయాంశంగా మారడం తో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రిన్సిపల్ ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారు.
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఆహ్ రౌరా లోని సద్భావన శిక్షణ హై స్కూల్ లో మధ్యాహ్న సమయంలో ఆడుకుంటున్న సమయం 2వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఒక విద్యార్థి మరొక విద్యార్థి కొట్టాడు. ఇక ఇది గమనించిన ప్రిన్సిపల్ మనోజ్ విశ్వకర్మ ఊహించని పనిష్మెంట్ ఇచ్చారు. పాఠశాల బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసాడు. దీంతో ఆ విద్యార్థి ప్రాణ భయంతో కేకలు వేశాడు. అయితే పిల్లలు అల్లరి చేస్తే ఎంతో ఓపికతో సర్ది చెప్పాల్సిన గురువు ఇలా చేయడంతో గ్రామస్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.