ఈ మధ్య కాలంలో గంజాయ్ రవాణా ఎక్కువగా జరుగుతుంది..పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పట్టుకున్నా కూడా పోలీసుల కళ్ళు కప్పె ప్రయత్నం చేస్తున్నారు. కొందరూ ముఠాలుగా ఏర్పడి ఇలాంటి సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు.  ఇటీవల విశాఖ జిల్లాలో గంజాయ్ తోటలపై పంజా విసిరిన సంగతి తెలిసిందే.. ఈ విషయం పై పోలీసులును అందరూ శభాష్ అంటున్నారు.ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పైకి పెళ్ళి వాహనం లాగా క్రియేట్ చేశారు. కానీ లోపల మాత్రం గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.


ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ పోలీసులు స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. గంజాయి స్మగ్లింగ్‌లో బాలికలు పట్టుబడడం ఇదే తొలిసారని జిల్లా పోలీసులు తెలిపారు. కారులో గంజాయిని సరఫరా చెస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెళ్లి స్టిక్కర్‌తో ఉన్న ఓ కారు అక్కడికి వచ్చింది.. పైకి సెటప్ చేశారు.


పెళ్ళికి వెల్థున్నాము అని చెప్పి నమ్మించె ప్రయత్నం చేశారు.ఒడిశా నుంచి రాయ్‌పూర్‌ వెళ్తోంది. ఈ క్రమంలోనే గరియాబంద్‌ పోలీసులు రోడ్డుపై తనిఖీలు చేపట్టారు. అప్పుడే ఆ బొలెరో వాహనం వచ్చింది. దానిపై పెళ్లి స్టిక్కర్ అంటించి, అలానే నమ్మించారు. అందులో ఉండేవాళ్ళు కూడా అదే చెప్పారు. దగ్గరిలొ పెళ్ళి జరుగుతుంది. అక్కడకు వెళ్తున్నాము అని చెప్పారు. కానీ కొన్ని అనుమానాలు కలగడం తో పోలీసులు వాహనాన్ని చెక్ చేశారు.. లోపల ఇద్దరు అమ్మాయిలు వున్నట్లు గుర్థించారు. అంతేకాదు భారీ మొత్తంలో గంజాయిని స్వాదీనం చేసుకున్నారు..గంజాయి ధర దాదాపు రూ.3 లక్షలు. గంజాయితో పాటు రూ.10,00,000 విలువైన కారు, రూ.22 వేల విలువైన నాలుగు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: