లోకంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ ఇంకొకటి లేదు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కేవలం జన్మనిచ్చిన నాటినుంచి కాదు కొడుకు పెరిగి పెద్దై ప్రయోజకుడు అయిన తర్వాత కూడా ఆ తల్లి కొడుకుపై ఒకే రకం ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అంతే కాదు  పిల్లలు ఎలాంటి లోపం తో పుట్టిన ఆ తల్లికి మాత్రం ఎప్పుడు పిల్లలు హీరో లాగే కనిపిస్తూ ఉంటారు. ఇక పిల్లలకు ఏ కష్టం వచ్చినా తానే ముందుండి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే తల్లి ప్రేమకే కళంకం తెచ్చే విధంగా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అమితమైన ప్రేమను పంచిన ఆ మాతృమూర్తి చివరికి కన్నకొడుకు విషయంలో కర్కశంగా ప్రవర్తించింది. మానవత్వాన్ని పంచాల్సిన ఆ తల్లి హృదయం చివరికి పేగు తెంచుకుని పుట్టిన కొడుకు మరణం కోరింది. ఎంతోమంది మనసును కదిలిస్తున్న ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం ఇందువుల గ్రామానికి చెందిన సోములు శైలజా దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇక ఎనిమిదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో భార్య శ్రీనివాస్ నగర్ కాలనీలో  కుమారులు రాజు గోపీచంద్ యోగేష్ లతో కలిసి నివాసం ఉంటుంది..


 ఇక ఏదో ఒక పని చేసుకుంటూ పిల్లల పోషణ చూసుకుంటుంది. అయితే ఆమె రెండో కుమారుడు గోపీచంద్ పుట్టుకతోనే అందుడు. అంతేకాదు వయసు పెరుగుతున్న కొద్దీ అటు మానసిక స్థితి కూడా కోల్పోతూ ఉన్నాడు. దీంతో కనీసం అతని స్కూల్లో చేర్చుకునేందుకు కూడా నిరాకరించారు.అయితే అంధుడైన కొడుకు విషయంలో మానవత్వాన్ని చూపించాల్సిన తల్లి చివరికి కన్న పేగు బంధాన్ని మరిచి మరణం కోరుకుంది. కొడుక్కి సరైన ట్రీట్మెంట్ ఇప్పించు లేక పోతున్నాను అని బాధతో చివరికి వేములవాడ మండలం లోని సాగర్ ఎడమ కాలువలు కొడుకుని తోసేసింది.. ఇక అక్కడే కాలువలో ఈత కొడుతున్న మరో ఇద్దరు గమనించి పోలీసులకుసమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు మృతదేహం కోసం గాలింపు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: