ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నీచులు ఎక్కువై పోతున్నారు. అయితే ఇలా ఎక్కడ వేధింపులకు పాల్పడుతున్నారో అనీ అందరూ భయపడుతూ బ్రతుకుతున్నారు. కాని కొంతమంది మహిళలు మాత్రం వేధింపులకు పాల్పడుతున్న వారికి సరైన బుద్ధి చెబుతున్నారు. ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆడవాళ్ళ పట్ల వెకిలి చేష్టలకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తే వదిలే ప్రసక్తే లేదు అంటూ నడుం బిగించారు మహిళలు. అలా వేధింపులకు పాల్పడే ది మగవాళ్ళు అయినా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులైన ఊరుకునే  ప్రసక్తే లేదు అంటూ హెచ్చరిస్తున్నారు.


 ఇటీవలే రోహతస్ జిల్లాలోని డెహరి జేడీయూ నాయకుడు  నారాయణ్ సింగ్ కూరగాయలు అమ్ముకునే మోహన్ బేగా గ్రామం నుంచి వచ్చిన మహిళలను ఇంట్లో కి రమ్మని పిలిచాడు. ఆ తర్వాత కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. ఇక వయసులో పెద్దవాడు రాజకీయ నాయకుడు కావడంతో ఒకటి రెండు సార్లు కుదరదు అని చెప్పేసింది సదరు మహిళ.. ఇక ప్రతిరోజూ సదరు మహిళను ఇంట్లోకి పిలవడం నీచంగా  ప్రవర్తించడం చేస్తూ ఉండేవాడు. ఇటీవలే ఇంట్లో ఎవరూ లేని సమయంలో సదరు మహిళను ఇంట్లోకి పిలిచి తలుపు గడి పెట్టాడు. దీంతో భయంతో మహిళ కేకలు వేసింది. చుట్టుపక్కల  ఉన్న మహిళలు అక్కడికి చేరుకుని కామాంధుడి చరి నుంచి కూరగాయలు అమ్ముకునే మహిళను విడిపించారు.


 ఇక కామాందుడు చేష్టలకు తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితురాలు చివరకు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ సమయంలోనే ఇక జెడియు నేత  నారాయణ సింగ్ తన అనుచరులతో పోలీస్ స్టేషన్కు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంతలో అక్కడ ఉన్న మహిళలందరూ నారాయణ సింగ్ కి దేహశుద్ధి చేశారు. చివరికి మహిళల చేతిలో చావుదెబ్బలు తిన్న నారాయణి చంపేస్తారని భయంతో పారిపోతూ కిందపడిపోయాడు. పోలీస్ స్టేషన్ లోకి దూరి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇక మహిళల దాడి చేయడమే కాదు బూతు పురాణం కూడా అందుకున్నారు. మహిళలపై  ఎవరు చేయి వేసిన ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: