ఇటీవల కాలం లో ఎంతోమంది క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాలు చివరికి జీవితాన్ని అర్ధాంతరం గా ముగిస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి నిర్ణయాలు ఎన్నో కుటుంబా లలో కూడా విషాదాన్ని నింపుతూ ఉన్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాస్త ఓపికగా ఆలోచించకుండా క్షణికావేశం లో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణం ఒక్కటే శరణ్యమని భావిస్తున్నారు. ఇక్కడ ఓ యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని తల్లి దండ్రులను విషాదం లో ముంచేసాడు.


 సోదరుల సమాధుల వద్దకు వెళ్లినా 25 ఏళ్ల ప్రవీణ్ చివరికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నేరువరం గ్రామానికి చెందిన బెదిర కనకయ్య కనుకవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు చంద్ర మోహన్ గతం లో కడుపునొప్పి వచ్చి భరించలేక చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి కనకయ్య కుటుంబం కరీంనగర్ వచ్చి అక్కడ నివాసం ఉంటుంది. ఇక సరిగ్గా రెండు నెలల క్రితం రెండో కుమారుడు రాజ్కుమార్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.


 ఇక ఇటీవల చిన్నవాడైన ప్రవీణ్ నాలుగేళ్ల నుంచి ఒక అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడూ. పెళ్ళికూడా చేసుకున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పెళ్లయి నాలుగేళ్లు అయినా అతనికి సంతానం కలగలేదు. అంతే కాకుండా ఇద్దరు సోదరులు మృతి చెందడంతో తీవ్ర మనస్థాపం చెంది చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు ఎవరూ కారణం కాదు అని ఫోన్ లో సెల్ఫీ వీడియో ని తీసుకొని తన సోదరుల సమాధుల వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ముగ్గురు కుమారుడు ఒకే తరహాలో మృతి చెందడంతో ఇక తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.. 

అయితే ఇలా అన్నదమ్ములు  అందరూ కూడా వరుసగా ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడంతో స్థానికంగా కూడా విషాదఛాయలు అలుముకున్నాయి అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: