అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోని ఘటనలు ఊహించని విషాదాలను తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. సంతోషంగా ఉన్న వారిని చూసి ఓర్వలేక ఏదో ఒక రూపంలో మృత్యువు కబళించేలా  చేస్తూ ఉంటుంది. చివరికి కుటుంబంలో విషాదం నిండి పోతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆ కుటుంబం ఆనందంగా ఉండటం విధికి అస్సలు నచ్చలేదు. దీంతో ఒక్కరి ప్రాణం కాదు అందరి ప్రాణాలు తీసేయాలని నిర్ణయించుకుంది. చివరికి విధి చిన్న చూపు చూడటం తో రోడ్డు ప్రమాదం రూపంలో కుటుంబం మొత్తం మృత్యుఒడిలోకి వెళ్ళిపోయింది. ఈ విషాదకర ఘటన అటు ఏపీలోని అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి రావడం గమనార్హం. మదనపల్లి సమీపంలోని పుంగనూరు రోడ్డు లో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా కల్వర్టును ఢీకొన్న కారు పక్కనే ఉన్న చెరువులో పడి పోయింది. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో నలుగురు వ్యక్తులు కారులో ఉండటం గమనార్హం. అయితే అప్పటికే తీవ్రంగా గాయాలపాలయ్యారు. చెరువులో పడిన కారు నుంచి బయటకు రాలేక పోయారు. చివరికి ఊపిరాడక ప్రాణాలు వదిలారు. అయితే ఇలా మృతి చెందిన నలుగురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు అని తెలుస్తోంది.


 దీంతో ఈ ఘటన కాస్తా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. మృతులు గంగిరెడ్డి, మధులత, ఖుషిత రెడ్డి, దేవాన్ష్ రెడ్డి అని పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే చెరువులో మునిగి పోయిన కారును బయటకు తీశారు. ఆ తర్వాత మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనలో మృతి చెందిన వారు నిమ్మనపల్లె మండలం రెడ్డి వారి పల్లి వాసులుగా గుర్తించారు పోలీసులు. పెళ్లి శుభకార్యానికి వెళ్లి వస్తున్న సమయంలో పుంగనూరు రోడ్డు లోని 155 వ మైలు రాయి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: