కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని చెబుతూ ఉంటారు పెద్దలు  అందుకే సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటారు. ఇక ఈ పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ఇష్టపడుతూ  ఉంటారు. ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం పెళ్లి అనే కాన్సెప్టును కమర్షియల్గా వాడుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా పరిచయాలు ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీస్తున్నాయ్. కానీ ఆ తర్వాత మాత్రం ఊహించని విధంగా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఇటీవలి కాలంలో ఏకంగా సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఎంతోమంది  అమ్మాయిలు అమాయకపు యువకులను బుట్టలో వేసుకుని పెళ్లి పేరుతో మోసగించి అందినకాడికి దోచుకుంటున్న సంఘటనలు తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే పశ్చిమ బెంగాల్ లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. పశ్చిమ బెంగాల్కు చెందిన అలోక్ అనే యువకుడికి ఒడిశాకు చెందిన మేఘన అనే యువతి పరిచయమైంది. ఫేస్బుక్ వేదికగా వీరిద్దరికీ పరిచయం కాగా 15 రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ పుట్టింది. ఈ క్రమంలోనే పెళ్లితో ఒక్కటవ్వాలి అని అనుకున్నారు ఇద్దరు యువతీ యువకులు.



 ఈ క్రమంలోనే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం కంటే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఉత్తమం అని భావించి చివరికి ఎంతో కష్టపడి పెద్దలను ఒప్పించారు. ఈనెల 24వ తేదీన జాజ్పూర్ లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ కు వచ్చిన ఒక అతిథి  కారణంగా అసలు విషయం తెలిసి ఇక పెళ్ళికొడుకు ఒక్కసారిగా షాక్ లో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెళ్లి కుమార్తెను మేఘనాథ్ అని పిలిచాడు. అతను మా బంధువే అంటూ చెప్పాడు పెళ్లికి వచ్చిన ఒక వ్యక్తి. దీంతో షాక్ అయినా వరుడి కుటుంబ సభ్యులుపైగా లేడి వేషం వేసుకున్న యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: