ఇటీవలి కాలంలో స్మగ్లింగ్ చేయడానికి అక్రమార్కులు కొత్త దారులను వెతుకుతూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అటు అన్ని ఎయిర్పోర్టులో  కూడా కస్టమ్స్ అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తులను తనిఖీలు నిర్వహిస్తూ వారు అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్, బంగారం సహా మరికొన్ని నిషేధిత వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇటీవల కాలంలో కొన్ని ఎయిర్పోర్టులో పట్టుబడుతున్న నేరస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది.


 అయితే ఇలా అక్రమంగా స్మగ్లింగ్ కు పాల్పడాలి  అనుకునేవారికి ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు షాక్ ఉన్నప్పటికీ కూడా అక్రమార్కుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. స్మగ్లింగ్కు  పాల్పడేందుకు కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. కేవలం పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా ఇటీవల కాలంలో స్మగ్లింగ్ లో  భాగం అవుతున్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో నేరస్తులను పట్టుకోవడం అటు కస్టమ్స్ అధికారులకు మరింత కష్టంగా మారిపోయింది. అయితే సూర్య నటించిన ఓ సినిమాలో సూర్య స్నేహితుడు కడుపులో డ్రగ్స్ ప్యాకెట్లను పొట్టలో దాచుకుని స్మగ్లర్ చేయడానికి ప్రయత్నిస్తాడు అన్న విషయం తెలిసిందే.


 ఇటీవలి కాలంలో అక్రమార్కులు మాత్రం అంతకుమించి అనే రేంజ్ లోనే స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడు శరీరంలో పేస్టు రూపంలో ఉన్న 433 గ్రాముల బంగారాన్ని లక్నో ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే నిందితుడు పేస్టు రూపంలో ఉన్న స్వచ్ఛమైన బంగారాన్ని టేపు తో చుట్టి పురీషనాళం లో దాచాడు. దాదాపు మూడు గంటలకు విమాన ప్రయాణం చేసి లక్నోకు చేరుకున్నాడు. అయితే ఇమిగ్రేషన్ లో వింత గా నటిస్తూ ఉండడంతో అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు.. మెటల్ డిటెక్టర్ తో తనిఖీ చేయగాఏదో ఉన్నట్లు గా చూపించింది. దీంతో అతని పురీషనాళం నుండి  బంగారాన్ని బయటకు తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: