తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి అంతకు మించిన సంతృప్తి ఇచ్చే తినుబండారం ఏది అంటే ప్రతి ఒక్కరూ చెప్పేది పానీపూరి అని. మన దేశంలో ఏ రాష్ట్రంలో కి వెళ్ళిన పానీపూరి కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ పానీపూరి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పానీ పూరి కి ఇంత మంచి టేస్ట్ ఎలా వచ్చిందబ్బ అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. ఇక ప్రతిరోజూ పానీపూరి తినడం ఒక అలవాటుగా పెట్టుకునేవారు కూడా నేటి రోజుల్లో ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు.


 వారు వీరు అనే తేడా లేదు. ప్రతి ఒక్కరికి పానీపూరి అనే పేరు వినిపిస్తే చాలు నోరూరిపోతుంది. అయితే కొన్నిసార్లు పానీ పూరి విక్రయించేవారు. శుభ్రత పాటించకపోవడం వల్ల  తీవ్ర అనారోగ్యాలకు గురి కావడం కూడా జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇటీవలే ఇలాంటిదే జరిగింది. ఎంతో టేస్ట్ గా ఉంది కదా అని పానీపూరి లాగించేశారు. కాని చివరికి 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో పెరుగుతూ వచ్చింది. హుగ్లి జిల్లాలోని సుగంధ గ్రామంలో ఓ వ్యక్తి బండి దగ్గర ఎప్పటిలాగానే ఎంతోమంది పానీపూరి తిన్నారు.


 కానీ అక్కడ పానీ పూరి తిన్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలు కడుపునొప్పి తో ఇబ్బంది పడ్డారు. కొంతమంది పరిస్థితి అయితే మరింత విషమించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వెంటనే అందరూ ఆసుపత్రులకు పరుగులు పెట్టారు. అయితే ఈ విషయంపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మందులు అందించారు. అయితే నీటి కాలుష్యంకారణంగా డయేరియా ప్రబలి ఉంటుందని వైద్యులు అనుమానిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: