సాధారణం గా ఎవరికైనా అప్పు ఇస్తే అది జీవితంలో చేసిన పెద్ద తప్పు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అప్పు ఇచ్చేటప్పుడు తీసుకున్న వారు ఎంతో ప్రేమగానే మాట్లాడుతారు. కానీ తిరిగి ఇవ్వమన్నప్పుడే శత్రువుల చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అప్పులు ఇచ్చి వడ్డీ వ్యాపారం చేయాలనుకున్నవారు చివరికి ఎవరైనా అప్పు ఎగ్గొడితే మనస్థాపం  చెందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇక్కడ అప్పు ఇచ్చి చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకుంది ఒక మహిళ. అప్పుగా ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వట్లేదు అన్న కారణంతో మహిళ ఎంతగానో మనస్థాపం చెంది చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నర్సంపేట మండలంలోని నర్సింగాపురంలో వెలుగులోకి వచ్చింది.  సామల మాధవి అనే మహిళ వితంతురాలు ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి నర్సింగాపురంలో తన ఇంటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలోనే కందగళ్ల ఆనంద్ అనే వ్యక్తికి ఏడాది కిందట 1,25,000 రూపాయలు అప్పుగా ఇచ్చింది. అయితే సదరు వ్యక్తి అప్పు తిరిగి ఇచ్చేందుకు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.


 వీరి పంచాయతీ పోలీస్ స్టేషన్కు వెళ్లిన సదరు మహిళకు మాత్రం న్యాయం జరగలేదు. దీంతో సామల మాధవి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక ఈ క్రమంలోనే నర్సింగాపురంలోనే ఆనంద్ ఇంటి ముందు మూడు రోజుల క్రిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందింది. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: