ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచారం జరుగుతున్న ఘటనలు  పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎక్కడికక్కడ పోలీసులు నిఘా ఏర్పాటు చేస్తూ ఉన్నప్పటికీ.. మహిళల రక్షణ కోసం షీ టీం అని ఒక ప్రత్యేకమైన పోలీస్ విభాగం పని చేస్తూ ఉన్నప్పటికీ.. మరోవైపు ఇక మహిళలపై అత్యాచారాలు చేసిన వారికి కఠిన శిక్షల విధించేందుకు సరికొత్త చట్టాలను తీసుకువస్తున్నప్పటికీ ఎక్కడ కామాంధులు తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 వెరసి  నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు ద్వారా ఇక ఆడపిల్ల రక్షణ రోజు రోజుకు ప్రశ్నార్థకం గానే మారి పోతుంది అని చెప్పాలి. ఏకంగా ఒంటరిగా ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయటపెట్టాలి అంటేనే భయపడే పరిస్థితి. మరోవైపు ఏకంగా ఇంట్లో వాళ్ళు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక దుర్భర  జీవితాన్ని గడుపుతున్నారు ఎంతోమంది ఆడపిల్లలు. ఇక ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వచ్చి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి.

 అయితే ఇటీవల కాలం లో ఇక లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కోర్టులు సైతం కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా అల్లా దుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గొల్ల కుంట తండా లో మతి స్థిమితం లేని బాలిక పట్ల అసభ్యం  గా ప్రవర్తించాడు ఓ కామాంధుడు. ఫుల్కల్ మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన జరుకుల సురేష్ ఇలా బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతనికి ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష తో పాటు 20000 జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు జడ్జి నిర్ణయం తీసుకున్నారు. 2016 అక్టోబర్ 12నఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: