ఇటీవల కాలంలో మనిషి జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఇతరుల ప్రాణాలు తీయడం లేదా తమ ప్రాణాలను తాము తీసుకోవడం అనేది ఒకటే సొల్యూషన్ అన్నట్లుగా మనిషి ఆలోచన తీరు మారిపోయింది. దీంతో నేటి రోజుల్లో మనిషి క్షణికావేషంలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఎన్నో దారుణాలు జరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కాస్తయినా వెనక ముందు ఆలోచించని పరిస్థితి నేటి రోజుల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఏకంగా పెళ్లి చేసుకుని తన జీవితంలోకి ఒక అమ్మాయిని ఆహ్వానించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని ఎన్నో కలలు కన్నాడు ఆ యువకుడు. ఈ క్రమంలో కూడా పెద్దలు నిశ్చయించిన  పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.  కానీ ఈ పెళ్లి తంతే తన జీవితాన్ని అర్ధాంతరంగా  ముగిస్తుంది  అని మాత్రం ఊహించుకోలేకపోయాడు. ఏకంగా పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా చూసుకుంటుంది అన్న భార్య పెళ్లికి ముందే  దారుణంగా ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది. ఏకంగా ప్రేమించిన వాడిని కాదనలేక మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక.
 ఏకంగా కాబోయే భర్తనే దారుణంగా చంపే ప్రయత్నం చేసింది ఒక బాలిక. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హరపనహల్లికి చెందిన దేవేంద్ర గౌడ కు 17 ఏళ్ల బాలికతో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆమె మేజర్ అయిన తర్వాతే పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు కూడా నిర్ణయించుకున్నాయి. అయితే అంతలోనే బాలిక మరో వ్యక్తిని ప్రేమించింది. దీంతో ప్రేమించిన వాడిని వదులుకోలేక ఇక మరొకరితో పెళ్లి ఇష్టం లేక ఆ బాలిక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కాబోయే భర్త  దేవేంద్ర గౌడను రీల్స్ చేద్దాము అంటూ పిలిచింది. ఆ తర్వాత కాళ్లు చేతులు కట్టేసి గొంతుపై కత్తితో పొడిచింది. ఇక స్థానికులు గమనించి ఆసుపత్రిలో చేర్పించగా.. యువకుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: