ఇటీవల కాలంలో నేటి రోజుల్లో యువత కొంతమంది బరితెగించి ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాలను నలుగురి మధ్యకు తీసుకొస్తున్నారు. పబ్లిక్ పార్కుల్లో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఇటీవల కాలంలో ఏకంగా నడిరోడ్డుపై బైక్ పైన రొమాన్స్ చేస్తూ ఉన్న వీడియోలు కూడా చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇక ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత నేటి రోజుల్లో యువత బాగా చెడిపోయారు అనే భావన అందరిలో కలుగుతూ ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు ఒక ప్రేమ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు  కొడుతుంది.



 మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ప్రేయసిని ఒక యువకుడు బైక్ పై ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు.. ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. ఇందుకు  అతని స్నేహితులకు కూడా సహాయం చేస్తూ ఉంటారు.. ఇక ఇప్పుడు అచ్చం సినిమా లెవెల్ లోనే ఒక యువకుడు తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ఇలాంటి ట్విట్టర్లో  వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక ప్రేమ జంట బైక్ పై వెళుతుంటుంది. కొంత దూరం వెళ్లగానే వెనక కూర్చున్న ప్రేయసి ప్రియుడిని కౌగిలించుకుంటుంది.


 అయితే యువతికి తెలియకుండానే యువకుడి స్నేహితులు వెనకనుంచి బైక్ ఫాలో అయ్యారు. ప్రేమ జంటకు సర్ప్రైజ్ చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే తమ టీ షర్టులపై ఐ లవ్ యు అనే అర్థం వచ్చేలా ముగ్గురు టీషర్ట్లు ధరించి మూడు బైకులతో ఇక ఈ ప్రేమ జంట బైక్ ముందు వెళ్ళసాగారు. అయితే ముందుగా యువతి ఇది చూసి ఆశ్చర్యపోయింది. అంతలోనే మరో స్నేహితుడు పూల బొకే తీసుకొచ్చి యువకుడికి ఇచ్చాడు. దీంతో యువతి ఒక్కసారిగా షాక్ అయింది. ఆ తర్వాత బైక్ ఒకచోట నిలిపి ఇక తన ప్రేయసికి పూల బొకే ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అయితే ఇదంతా చూడ్డానికి బాగున్నప్పటికీ రోడ్డుపై ఇలాంటివి అవసరమా అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్న వారు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: