సాధారణంగా భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటేన తర్వాత కష్టసుఖాలు పాలుపంచుకోవాలి. కానీ నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య మాత్రం ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్న భార్యాభర్తలు.. కాళ్ల పారాణి కూడా ఆరకముందే విడిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. చిన్నచిన్న కారణాలతోనే గొడవలు పడుతూ చివరికి కోర్టు మెట్లు ఎక్కి విడాకులు తీసుకుంటున్నారు.


 ఇంకొంతమంది ఇలా మనస్పర్ధలతోనే కలిసి బ్రతుకుతూ చివరికి ఒకరి ప్రాణాలను ఒకరు తీసుకోవడానికి ప్రస్తుతం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇలాంటి తరహా ఘటనలు దాంపత్యబంధం నమ్మకాన్ని పోగొట్టుతున్నాయి అని చెప్పాలి. మరోవైపు ఏకంగా కట్టుకున్న బంధాన్ని కాదని.. అక్రమ సంబంధానికి తెరలేపుతున్న ఎంతోమంది పరాయి వాళ్ళ మోజులో పడిపోయి కట్టుకున్న వారిని కూడా హతమారుస్తున్నారు. ఇలా వివాహేతర సంబంధం నేపథ్యంలో నేటి రోజుల్లో జరుగుతున్న దారుణమైన హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.


 అయితే ఇటీవల హైదరాబాద్ నగరం లోని అమీర్పేట్ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యం లో భర్త విజయ్ ను భార్య శ్రీలక్ష్మి దారుణం గా చంపేసింది. పిల్లలను స్కూల్లో దింపి.. ఇంటికి వచ్చిన విజయ్ లోపలికి రాగానే భార్య గడియ పెట్టింది. అయితే అప్పటికే లోపల ఉన్న రాజేష్, రౌడీషీటర్ రాజేశ్వర్ రెడ్డి ఉండగా ఇక అందరూ కలిసి ఇనుప రాడ్లతో కొట్టి విజయ్ ని దారుణం గా చంపేశారు. అయితే ఇలా దాడి చేస్తున్న సమయంలో చంపకండి అంటూ కాళ్లు పట్టుకొని వేడుకున్న..  భార్య మాత్రం కనికరించలేదు. మరునాడు ఇలా విజయ్ ని హత్య చేసిన రాజేష్ పశ్చాత్తాపంతో  పోలీసుల ముందు లొంగిపోయి నిజాలను బయటపెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: