
అదే రష్యా భాగ్పుత్ విషయంలో వ్యాగనార్ గ్రూపు జోక్యం చేసుకోవడం. రష్యా దేశ సైనికులు భాగ్పుత్ పై దాడికి బయలుదేరినప్పుడు ఆ వార్తను భాగ్పుత్ కి చేరవేసి వాళ్లను అలర్ట్ చేశారట వ్యాగనార్ గ్రూపు అధ్యక్షుడు. వ్యాగనార్ గ్రూప్ అధ్యక్షుడు ఒకవైపు రష్యాతో ఉంటూనే అమెరికా ఇంకా యూరప్ దేశాల తరఫున కూడా సహాయం అందించినట్లుగా తెలుస్తుంది. దీన్ని రష్యా సైన్యంతో పాటు ఆ దేశపు అధ్యక్షుడు పుతిన్ కూడా పెద్ద నమ్మకద్రోహం గా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.
మరి ఇప్పటివరకు రష్యా అధ్యక్షుడికి తోడు ఉంటూ వచ్చిన వ్యాగనార్ గ్రూప్ లేకపోతే ఎలా అనే బాధే లేదు పుతిన్ కు. ఎందుకంటే రష్యా దేశానికి రెండు రకాల సైనికులు ఉంటారట. ఒక రకం సైనికులు నేవీ, మిలటరీ, ఆర్మీ వాళ్లయితే, రెండో రకం సైనికులు చెచన్ వర్గం ఇంకా వ్యాగనార్ వర్గం అన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వ్యాగనార్ గ్రూపు పక్కకి వెళ్లిపోగానే ఆ ప్లేస్ లో చెచన్ గ్రూపును ముందుకు తీసుకు వచ్చాడట పుతిన్.
గతంలో వ్యాగనార్ గ్రూపు జైళ్లలో ఉన్న ఖైదీలను కూడా సైనికులుగా ఉపయోగించి చేయించిన యుద్ధాలలో వాళ్లలో చాలామంది చనిపోవడం కూడా జరిగిందని తెలుస్తుంది. కానీ వాళ్ళు సైనికుల్లా కాకుండా యుద్ధ ఖైదీలు గానే మరణించే వారిని తెలుస్తుంది. గతంలో భాగ్పుత్ విషయంలో వ్యాగనార్ గ్రూపు ఇబ్బంది పెట్టడంతో ఇప్పుడు చెచెన్ గ్రూపును డొనేట్ స్కి పైకి దాడికి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది.