కేజ్రీవాల్ ఇప్పుడు మరో కొత్త కుంభకోణంలో చిక్కుకున్నారని తెలుస్తుంది. అదే ప్యానిక్ బటన్ కుంభకోణం. టాక్సీలలో వెళ్లేటప్పుడు మహిళలకు ఏదైనా అనుకోని ఆపద డ్రైవర్ల ద్వారా గాని, ఇతర వ్యక్తుల నుండి కానీ ఎదురయ్యే సంఘటనలను మనం గతంలో చూసాం. అలాంటి అనుకోని సంఘటనలు ఏవైనా ఇలా క్యాబ్ ల్లో ప్రయాణించేటప్పుడు మహిళలకు ఎదురైతే వాళ్లు వెంటనే ఈ ప్యానిక్ బటన్ ని ప్రెస్ చేయాలి.


అప్పుడు సమాచారం పోలీస్ స్టేషన్ కి వెళ్లి దీనిపై చర్యలు తీసుకునే విధంగా  ఏర్పాటు జరిగింది. ప్రతి ఆటోలో, ప్రతి క్యాబ్లో ఈ ప్యానిక్ బటన్ అనేదాన్ని ఏర్పాటు చేయాలి. అయితే ఈ ప్యానిక్ బటన్ గురించి అడ్వర్టైజ్మెంట్లు టీవీల్లో, పేపర్లో వేయించడానికి, ప్రచారం చేయడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం వేల కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఉబర్ డ్రైవర్ వ్యాపారం చేయడానికి క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఉండాలి.


దీనికి తొమ్మిది వేల రూపాయల వరకు ఖర్చవుతుంది అని తెలుస్తుంది. బస్సులు వాళ్లయితే 22వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది వీటి కోసం అయితే. ఇవి వాళ్లు ఖర్చు చేసిన తర్వాత తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు 50 క్యాబ్ ల నుండి పోలీస్ స్టేషన్ కి కాల్ చేసారట. అయితే పోలీస్ సిబ్బంది నుండి ఏ విధమైన రెస్పాన్స్ లేదని తెలిసింది. అంటే చాలా వరకు ఈ ప్యానిక్ బటన్లు అసలు పని చేయడం లేదని ఫైనల్ గా తెలిసిందట.


ప్యానిక్ బటన్ ఇన్స్టాలేషన్ కు సంబంధించిన కాంట్రాక్టర్లలో పారదర్శకత లేదని తెలుస్తుంది. అంతేకాకుండా ఆ కాంట్రాక్టర్లకు ప్రభుత్వానికి కోఆర్డినేషన్ లేదని, అలాగే కాంట్రాక్టర్లకు పోలీస్ వారికి కోఆర్డినేషన్ లేదని తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్  ఆధీనంలో ఉందని తెలుస్తుంది. కానీ దానికి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వసూలు చేశారట. దాంతో కేజ్రీవాల్ కు అదొక కుంభకోణం అయిన పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: