తిరుపతి జిల్లాలో సీఐ అంజు యాదవ్ జనసేన కార్యకర్త ని చెంప  దెబ్బ కొట్టిన విషయం ఇటీవల తెగ వైరల్ అయ్యింది. ఆందోళన సమయంలో సీఐ అంజు యాదవ్ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తను చెంప దెబ్బ కొట్టడంతో  జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. అది కాస్త రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది. అంజు యాదవ్ ని సస్పెండ్ చేయాలని ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.


అయితే ఆమెపై అంత ఈజీగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ విషయంలో సీఎం జగన్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అంజు యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక సీఐ కాబట్టి ఆమెపై చర్యలు తీసుకుంటే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. గతంలో బీసీల ఓట్లు అనగానే టీడీపీకి గంపగుత్తగా పడేవి.


బీసీలకు మంత్రి పదవులు ఇస్తూనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా సీఎం జగన్ బీసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో బీసీల కంటే కాపులు, కమ్మ వాళ్ళ మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. కానీ పశ్చిమగోదావరి జిల్లా వచ్చేసరికి బీసీలు కాపుల మధ్య ఓట్ల విషయంలో ఎక్కువగా రగడ జరుగుతుంది.


కాబట్టి బీసీల ఓట్లను కాదనుకునేలా జగన్ దూరం చేసుకోవడానికి సిద్ధం లేడు. బీసీలకు సంబంధించి ఎక్కడ కూడా రాబోయే ఎన్నికల్లో వివాదం జరగకుండా చూసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఏమైనా చర్యలు తీసుకుంటే వ్యతిరేకత వస్తుందని  రాజకీయ వర్గాల అభిప్రాయం. సాధారణ బదిలీలో ఆమెను కూడా బదిలీ చేస్తే సరిపోతుంది. కానీ ప్రత్యేకంగా బదిలీ గాని సస్పెన్షన్ గాని చేస్తే బీసీల్లో వ్యతిరేకత వస్తుందని వైసీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: