అయితే ఈ విమర్శలు అనేవి ఎప్పుడూ ఒకరిపై ఒకరు జరుపుకుంటూనే ఉంటారు. ఇలాంటి విమర్శలు చేయడం కూడా తప్పు కాదు. ఎందుకంటే అది ఆయన ఉద్దేశం కాబట్టి. అయితే అదే ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మరొక కీలకమైన విషయాన్ని కూడా లేవనెత్తారు. జగన్ ప్రభుత్వం లో ఉండలేక కొంత మంది రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతున్నారని ఆయన అనడం జరిగింది. అయితే గతంలో కూడా కొంతమంది భారతదేశం పద్దతి తనకు నచ్చడం లేదని, భారత దేశం నుండి తాము బయటకు వెళ్లిపోతామని అనడం జరిగింది.
అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఇదేవిధంగా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడానికి సిద్ధం అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో ఉన్నటువంటి కుట్రలు, కుతంత్రాలు అనేవి పెద్దగా తెలియవని కొంత మంది రాజకీయ నిపుణులు అంటున్నారు. పవన్ ఇలా రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాను అనే వారి లోగుట్టును తెలుసుకోవాలని వాళ్లు అంటున్నారు.
ఈ రాష్ట్రానికి గాని, ఈ దేశానికి గాని ఏమీ చేయలేనటువంటి ఏ వ్యక్తి అయినా బయటికి వెళ్లిపోతానంటే బాధపడవలసిన అవసరం లేదని వాళ్లు అంటున్న మాట. ఒక రాజకీయ నాయకుడు కానీ మరొక వ్యక్తి గాని, మరెవరైనా సరే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాను అంటున్నారంటే దాని అర్థం వేరే ఉంటుందని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ దోచుకోవడానికి అవకాశం లేకే ఈ రాష్ట్రం నుండి గాని, దేశం నుండి గాని వెళ్ళిపోదాం అనుకుంటారట వాళ్ళు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి