తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. అయితే మొన్న ప్రచారం పర్వం ఇలా ముగిసిందో లేదో వెంటనే తదుపరి ఘట్టమైన పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించారు రాజకీయ నాయకులు. గ్రామాలు, పట్టణాల్లో ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర తాయిలాలతో ప్రలోభపెట్టే కార్యక్రమం ప్రారంభించారు. ప్రచారం ఒక వంతు అయితే పోల్ మేనేజ్ మెంట్ మరో ఎత్తు. ఎన్నికల యుద్ధంలో పోల్ మేనేజ్ మెంట్ లో వెనుకపడితే ఫలితాలు తారు మారయ్యే అవకాశం ఉంది.


దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవు. పోలింగ్, బూత్ స్థాయి మేనేజ్ మెంట్ పై దృష్టి సారించాయి. అధికారంలో ఉన్నవారికి తప్పకుండా పోల్ మేనేజ్ మెంట్ లో పైచేయి సాధిస్తారు. మనం కొన్ని ఉదాహరణలు చూసుకున్నా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకట స్వామి, కేఎల్ఆర్ కు సంబంధించిన డబ్బులు పట్టుకున్నారు తప్ప బీఆర్ఎస్ కానీ, బీజేపీ నాయకుల డబ్బులు ఇప్పటి వరకు పట్టుబడలేదు.  అంటే ఆ పార్టీ నాయకులు డబ్బులు పంచడం లేదా అంటే కాదు కదా.


ఒకవేళ కాంగ్రెస్ ఇస్తున్న పోటీ బీజేపీ ఇచ్చి ఉంటే బీఆర్ఎస్ కు ఆ పార్టీ సవాల్ విసేరేదే. ఎందుకంటే అమిత్ షా, ప్రధాని మోదీ లు పోల్ మేనేజ్ మెంట్ లో సిద్ధహస్తులు. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లేవారు. పీపుల్ మేనేజ్ మెంట్ వేరు. పోల్ మేనేజ్ మెంట్ వేరు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంత డబ్బులు వెచ్చించినా తటస్థ ఓటర్లు కచ్చితంగా అభ్యర్థిని చూస్తారు. ఒక్కోసారి క్రాస్ ఓటింగ్ కు పాల్పడుతుంటారు. జనాలు ఫలానా పార్టీకి ఓటేయాలని బలంగా నిర్ణయం తీసుకుంటే పోల్ మేనేజ్ మెంట్ కూడా పనిచేయవు. ఉదా కర్ణాటకలో బీజేపీ, ఏపీలో టీడీపీ లు అధికారంలో ఉన్నా ఓడిపోయాయి. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు ఎంత పోల్ మేనేజ్ మెంట్ చేసినా ఉపయోగం ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: