ఏపీలో ఎన్నికలు వైసీపీ వర్సెస్ కూటమి రాజకీయం కాసేపే పక్కన పెడితే.. ప్రధానంగా షర్మిల వర్సెస్ జగన్ మధ్య రాజకీయం మరింత చర్చనీయాంశం అవుతుంది. ప్రధానంగా షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి వైఎస్ కుటుంబంలో రాజకీయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇంతకీ అన్నకీ, చెల్లెకి మధ్య ఎందుకు వివాదం మొదలైంది. ఆస్తి కోసమా, కుటుంబ కలహాలా, లేక అధికారామా అంటే ఎవరికీ నచ్చిన విశ్లేషణలు వారు చెబుతూ ఉంటారు.


ఇప్పుడు పై వాటితో పాటు మరో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది.  షర్మిల భర్త బ్రదర్ అనిల్ కి కొండల్ రావు తో పాటు మరో వ్యక్తి ముఖ్య సన్నిహితులుగా ఉన్నారు. వీరిద్దరకీ కాంట్రాక్టులు అంటే…ఇసుక రీచ్ లు కాంట్రాక్ట్ ఇచ్చిన విధంగా గనులు ఇవ్వాలని జగన్ ముందు అనిల్ ప్రతిపాదన పెట్టారు. దీనికి సీఎం జగన్ నిరాకరించడంతో రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగింది.


ఈ క్రమంలో కొండలరావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారం లో భాగంగా వైఎస్సార్ జిల్లా గుర్రాల చింతలపల్లి వచ్చిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను స్థానికులు అడ్డుకున్నారు. అనీల్ కుమార్ స్నేహితుడిని అంటూ కొండల్ రావు తమని మోసం చేశారని ఆరోపించారు. మైనింగ్ వాహనాలను బాడుకకు తీసుకొని దాదాపు రూ.4 కోట్ల వరకు ఎగ్గొట్టారు. ఈ డబ్బుల విషయమై కొండల్ రావుని ప్రశ్నిస్తే షర్మిళ కంపెనీ అంటూ బెదిరిస్తున్నారని వాపోయారు.


వెంటనే తమ బకాయిలను ఇవ్వాలని షర్మిలను వారంతా డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లాలో ఓ  సంస్థ పేరిట జరుగుతున్న మైనింగ్ వ్యవహారాలను కొండల్ రావు పదేళ్లుగా చూస్తున్నారు. ఈయన తాను బ్రదర్ అనీల్ స్నేహితుడినని చెప్పుకొని తిరుగుతూ ఉండేవాడు. తద్వారా పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత స్థానికుల దగ్గర నుంచి టిప్పర్లు, ట్యాంకర్లు అద్దెకు తీసుకొని వాటిని తిప్పుతూ ఉండేవాడు. ఇప్పుడు వాటి బకాయిలు రూ.4 కోట్లకు చేరాయి. వీటిని మీరు ఇప్పించాలని వారు షర్మిలను కోరగా.. దీనికి నాకు ఏం సంబంధం లేదని ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: