కరోనా సమస్య నుండి మనదేశం పూర్తిగా బయటపడాలంటే జూలై 25 వరకూ వెయిట్ చేయాల్సిందేనని తాజాగా ఓ నివేదిక చెబుతోంది. నీతి అయోగ్ కమిటి సభ్యుడు వీకే పాల్ నేతృత్వంలో అధ్యయనం చేసిన కమిటి, సింగపూర్ యూనివర్సిటి చేసిన అధ్యయనంలో ఈ విషయాలు స్పష్టంగా తెలిసిందట. గడచిన 15 రోజులతో పోల్చుకుంటే ఇపుడు బయటపడుతున్న కేసులు సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. ఇపుడు కేసులు ఎందుకు నమోదవుతున్నాయంటే ఎక్కువమందికి పరీక్షలు చేస్తున్నారు కాబట్టి కేసులు బయటపడుతున్నాయి.

 

వచ్చే నెల అంటే మే 2వ వారం వరకు కేసుల ఉధృతి ఇలాగే ఉంటుందట. ఇపుడున్న కేసులకు మే 3వ వారం నాటికి సుమారు 35 వేల కేసులు అదనంగా యాడ్ అవుతాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మే రెండో వారానికి కేసుల సంఖ్య గరిష్టంగా నమోదైనా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నివేదికలు చెబుతున్నాయి. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నాయంటే అందుకు కారణం వీలైనంత మందికి పరీక్షలు నిర్వహిస్తుండటమే అని నిపుణలు అభిప్రాయపడుతున్నారు.

 

అయితే మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఊహించిన దానికన్నా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంపైనే  నిపుణులు కాస్త టెన్షన్ పడుతున్నారు. అధిక వేడి, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో వైరస్ తొందరగా వ్యాప్తించదని శాస్త్రజ్ఞులు చెప్పినట్లే చాలా రాష్ట్రాల్లో తీవ్రత తక్కువగానే ఉండటం పట్ల నిపుణులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

 

దేశంలో బయటపడుతున్న కేసులు, మరణాలు, డిస్చార్జి తదితరాలను ఆధారంగా చేసుకుని సింగపూర్ యూనివర్సిటి చేసిన అధ్యయనంలో కూడా సానుకూల రిజల్ట్సే వచ్చాయి. మే 27వ తేదీకి లేకపోతే చివరి వారం నాటికి కరోనా వైరస్ తీవ్రత చాలా వరకు తగ్గిపోతుందని నివేదికలో స్పష్టం చేసింది. మొత్తం మీద జూన్ మాసం మొత్తం కేసులపై అధ్యయనం చేయటానికి ఉపయోగించుకున్నా జూలై 25వ తేదీకి దేశంలో కరోనా వైరస్ సమస్య దాదాపు తగ్గుముఖం పడుతుందని నివేదిక స్పష్టం చేయటం సంతోషించాల్సిన విషయమే.

 

ప్రస్తుతం దేశంలో సుమారు 21 వేల కేసులున్నాయి. అలాగే వైరస్ దెబ్బకు సుమారుగా 900 మంది చనిపోయారు. అంటే నిపుణుల నివేదికల ప్రకారం  ఈ సంఖ్య మరింతగా పెరిగి తర్వాత తగ్గుతాయన్న విషయం అర్ధమవుతోంది. ఏదేమైనా యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించేస్తున్న విషయాన్ని అందరూ చూస్తున్నదే. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్, జర్మనీ లాంటి దేశాలతో పోల్చుకుంటే మనదేశం జనాభా, నమోదైన కేసులు, మరణాలు తక్కువనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: